మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి మనం ఈ మధ్యకాలంలో చాలా మంది నోళ్ళల్లో మ్యూచువల్ ఫండ్స్….. మ్యూచువల్ ఫండ్స్….. అని వింటూనే ఉంటాం కదా అసలు ఇంతకీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి దీనిలో డబ్బు పెట్టటం వల్ల మనం ఎలాగ ధనవంతులం అవుతామో మనం ఏ రకంగా మన ఆర్థిక స్థితిగతులని మెరుగుపరచుకోగలము అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణంగా మనకి షేర్ మార్కెట్ అనేది ఉంటుంది షేర్ మార్కెట్లో మనకి అవగాహన ఉండటం వల్ల దాన్లో డబ్బులు పెట్టుబడి పెడితే చక్కని లాభాలు మనకి అందుతాయి కానీ మనకు అసలు షేర్ మార్కెట్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేదు అంటే ఎటువంటి జ్ఞానం కూడా లేదు అలాంటప్పుడు ఏం చేస్తాం మనం అనవసరంగా డబ్బులు పెట్టి చేతులు కాల్చుకోలేము కదా
అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒకచోట షేర్స్ లో పెట్టే బదులు కొంతమంది చాలా అద్భుతమైన ఆర్థిక నిపుణులు మన దగ్గర నుంచి డబ్బు తీసుకొని అది రకరకాల కంపెనీలలో రకరకాల రాబడి వచ్చే చోట వాటిని పెట్టుబడిగా పెట్టి రాబడి తీసుకొని దాన్లో కొంత భాగం వాళ్ళు ఉంచుకొని మిగిలిన రావాలని మనకు ఇస్తారన్నమాట అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎలా ఉంటాయి అంటే ఒకేసారి మనం అన్ని రకాల పెట్టుబడిని కలిపి ఒకటే రకమైన పెట్టుబడి చేయటం మ్యూచువల్ ఫండ్స్ అంటారు అయితే మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాల ఫండ్స్ ఉన్నాయండి మనకు అసలు ఏం జ్ఞానం లేకపోయినా ఏ రకంగా పొదుపు చేయాలి ఏ రకంగా పెట్టుబడి చేయాలి అని తెలియకపోయినప్పటికీ కూడా మనం చాలా చక్కగా దీనిలో లాభాలను గడించొచ్చు
Why We Have To Invest In Mutual Funds?
ఫ్రెండ్స్ మనలో చాలామంది చాలా రకాలుగా మన లక్ష్యాలను పెట్టుకుంటుంటాం అంటే ఉదాహరణకి మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన పెద్దవాళ్లు మన చదువుల కోసం అంటే పిల్లల చదువుల కోసం అమ్మాయి పెళ్లి కోసం ఇంకా చెప్పాలంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి ఒక కారు కొనుక్కోవాలి ఇంకా వేరే ఏవేవో కోరికలు కలలు… ఇవన్నీ కాదు రిటైర్మెంట్ అంటే నేను 50, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సుఖంగా ఆనందంగా ఉండాలి. ఇలాగ రకరకాలుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కోరుకుంటుంది. చెప్పాలంటే ఒక మనిషికి ఎన్ని కోరికలు అయినా ఉండొచ్చు కానీ మనం నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కూడా మనం అనుకున్న పనులను సాధించాలి అంటే పెట్టుబడి అవసరం ఎందుకంటే ఈరోజు 100 రూపాయల గోధుమపిండి రేపటి రోజున 150 రూపాయలు అవుతుంది కానీ పెరిగే జీతాలు మాత్రం 100 నుంచి 200 కి వెళ్ళవు 100 నుంచి 110 కి మాత్రమే వెళ్తాయి. అంటే ఒక గోధుమపిండి విషయంలోనే దాదాపుగా మనం 40,000 మన బడ్జెట్లో లోటుగా ఉన్నాము అంటే కచ్చితంగా రాబోయే కాలంలో మనం సంపాదిస్తున్న ఈ డబ్బు అనేది అస్సలు మనకి సరిపోదు దాన్ని ద్రవ్యోల్బణం అంటారన్నమాట………..
Conclusion
అంటే మనం మన కోరికలను త్వరగా తీర్చుకోవాలి అంటే మన ఆర్థిక అవసరాలు తీరాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం దీనిలో మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది పెట్టుబడి అనేది బాగుంటుంది అయితే ఇది చాలా సుదీర్ఘకాలం పాటు మనం పెట్టుబడి పెట్టాల్సిన ఒక అంశమని చెప్పుకోవచ్చు ఎందుకు మనం మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలి అనేది ఇప్పుడు మీకు అర్థమైంది కదా