Pre-payment Of Personal Loan! Points to remember When Paying Personal Loan to bank early closure

please share if you like

మనలో చాలామంది బ్యాంకు రుణాలను తీసుకుంటూ ఉంటాం కదా అయితే దానిలో పర్సనల్ లోన్ అంటే వ్యక్తిగత రుణం అనేది చాలా అధిక శాతం వడ్డీతో మనకి అందుబాటులోకి వస్తుంది. అయితే చాలామంది ఇంటిలోను తీసుకుంటారు కార్ లోన్ తీసుకుంటారు లేదంటే విద్యకు సంబంధించిన రుణం అంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటూ ఉంటారు బిజినెస్ లోన్ కూడా తీసుకుంటూ ఉంటారు కానీ పర్సనల్ లోన్ విషయంలో మాత్రం చాలా మంది ఎక్కువగా వడ్డీ కట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటప్పుడు ఆ పర్సనల్ లోని తీర్చేయాలి అనుకున్నట్టయితే కొన్ని రకాల విషయాలను మనం కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి . పర్సనల్ లోన్ ముందుగా తీర్చేయాలి అని కనుక మనం అనుకున్నట్లయితే ఉదాహరణకి మీరు రెండు లక్షల రూపాయల మొత్తాన్ని పర్సనల్ లోన్ గా తీసుకున్నట్లయితే మీకు బ్యాంక్ వాళ్ళు దాని తిరిగి వడ్డీతో సహా చెల్లించే అంశాన్ని ఒక నాలుగేళ్ల వరకు పెట్టారనుకుందాం అంటే రెండు లక్షల రూపాయలు అప్పు తీర్చడం కోసం అసలు వడ్డీ కనిపిస్తుంది అనుకున్నట్టయితే బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే దానికి తగ్గట్టుగా మీకు ఈఎంఐ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే చాలామంది ఎప్పుడైనా సరే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా డబ్బు అంటే అధికంగా కొంత డబ్బు ఏదైనా వచ్చినా అంటే బోనస్ రూపంలో కానీ లేకపోతే వేరే ఇతర వాళ్లకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రయోజనాలు వచ్చినట్టయితే వాళ్లు పర్సనల్ లోనే ముందుగానే తీర్చేయాలి బ్యాంక్ కి అప్పు కట్టేయాలి అని అనుకుంటారు అంటే పర్సనల్ లోన్ ప్రీ పేమెంట్ అన్నమాట ఇలాగా ముందుగా పర్సనల్ లోని తీర్చేస్తున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు బడితే అప్పుడు ఎక్కడపడితే అక్కడ ఎలా పడితే అలా కట్టడానికి వీల్లేదు దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం . పర్సనల్ లోని మీరు తిరిగి చెల్లించాలి అనుకున్నట్టయితే బ్యాంకు కి కచ్చితంగా మీరు 12 నెలల ఇఎంఐ ని కట్టి తీరాలి 12 నెలలు పూర్తయిన తర్వాత మాత్రమే మీరు మీరు తీసుకున్న మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించే అవకాశం ఉంటుంది దానితో పాటుగా నాలుగు శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అంటే ఉదాహరణకి

ఒక వ్యక్తి రెండు లక్షల రూపాయల అప్పుని తీర్చాలి అనుకుంటే అతను నాలుగు శాతం పెనాల్టీని కట్టాల్సి ఉంటుంది రెండు లక్షల రూపాయలు * నాలుగు శాతం పెనాల్టీ అంటే ఎనిమిది వేల రూపాయలు కట్టాలి అనమాట ఈ విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని పర్సనల్ లోన్ తీసుకోవాలి

please share if you like