ప్రతి ఒక్కరికి చాలా అందంగా ఆకర్షినియంగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ ప్రస్తుతం బయట కాలుష్యం లేదా గజిబిజి ఆహార శైలి ప్రతి ఒక్కటి కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయ్ ముఖ్యంగా మన అందాన్ని ఆరోగ్యాన్ని రెండిటిని దెబ్బతిస్తున్నాయ్ అయితే దీనికి పరిష్కారం ఏమిటి?
ముఖం మిద మొటిమలు, అవాంచిత రోమాలు, అతిముఖ్యంగా జుట్టు బాగా రాలిపోవడం ఇలాగా రకరకాలుగా మన రూపు రేఖలు మారిపోవడంతో పాటు మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతిస్తాయి మరి దీనికి పరిష్కరం ఇప్పుడు మనం మన ఇంటి చిట్కాలతో తెలుసుకుందాము
ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో లోపం వల్ల మనకి పై సమస్యలు తల్లెత్తుతున్నాయి అందుకే మనం మన ఆహారంలో ఎక్కువ శాతం సహజసిద్దమైన ఆహారం తీసుకోవాలి అంటే తాజా పళ్ళు పచ్చి కురకాయలు,పండ్ల రసాలు మొలకెత్తిన విత్తనాలు పెరుగు పాలు ఇలాంటి ఆహారాలు తీసుకోవాలి ఇలాగా తీసుకోవడం వల్ల మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యం తగ్గుతుంది దాంతో మనకి అందం ఆరోగ్యం రెండు కూడా బాగుంటాయి
ఇప్పుడు మనం ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు ఏమేమి తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం
అల్పాహారానికి ముందు కాఫీ టీ కి బదులు నిమ్మరసం మరియు తేనే కలిపి తీసుకోవాలి ఉదయం అల్పాహారం కింద మొలకెత్తిన విత్తనాలు దానిలో కొద్దిగా కర్జుర పండ్లు లేదా అరటిపండ్లు తిసుకొచ్చు లేదా 3 నానబెట్టిన బాదం లేదా ఒక బొప్పాయి ముక్క తీసుకుంటే కడుపు నిండి ఉత్సాహంగా ఉంటారు
మధ్యానం 200గ్రాముల రైస్ ఒక కప్పు పప్పు ఒక కప్పు కూర ఒక కప్పు పెరుగు లేదా గ్లాస్ మజ్జిగ తీసుకోవాలి రాత్రి భోజనం చాలా తేలికగా ఉండాలి రెండు పుల్కాలు పన్నీర్ కూర రాత్రి నిద్రపోయ ముందు పసుపు కలిపినా పాలు తీసుకుంటే చాలా మంచిది