రోజు రోజు కి దిగజారుతున్న గోపి చంద్ పరిస్థితి.. సినిమాలు లేక ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు

please share if you like

గోపి చంద్ టాలీవుడ్ కి పరిచయం అక్కరలేని పేరు .. టాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చిన 6 అడుగున బుల్లోడు .. నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు .. ఐతే కొంత కొన్ని రోజులగా గోపి చంద్ కి సరైన హిట్ లేదు .. సినిమా లు ఐతే వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా హిట్ అవ్వడం లేదు .. సరైన కథ లేక నా లేక సినిమా లు ఎంచుకోవడం చేతకాకనా అని కూడా టాక్ వినిపిస్తుంది .. ఐతే గోపి చంద్ కెరీర్ ఎక్కడ మొదలైందో మళ్ళి అక్కడీకే వస్తుందని అంటున్నారు..

విప్లవ సినిమాల బ్రాండెడ్ డైరెక్టర్ గా పేరు గాంచిన టి.కృష్ణ వారసుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన గోపీచంద్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలానే కష్టపడ్డాడు. హీరోగా తోలి వలపు సరైన సక్సెస్ దక్కకపోవడంతో.. దర్శకుడు తేజ సలహా మేరకు బాడీ బిల్డ్ చేసి జయం లాంటి సినిమా లో విలన్ గా ఎంట్రి ఇచ్చాడు .. ఆ తరువాత వర్షం సినిమా మంచి పేరు వచ్చింది ..

ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. నిజం సినిమాతో పేరు వచ్చినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో ఆడకపోవడంతో స్లో అయిన గోపీచంద్ ఆ తర్వాత రూట్ మార్చి మళ్ళి హీరో అవతారం ఎత్తి యజ్ఞం సినిమాతో సూపర్ హిట్ కొట్టేసాడు.

ఆ మధ్య పరమ రొటీన్ కథలతో ప్రేక్షకులను విసుగెత్తించి వరస ఫ్లాప్లు కొట్టిన గోపీచంద్ లౌక్యం సినిమాతో ట్రాక్ లో పడ్డాడు అనుకుంటే మళ్ళి అదే ఫార్ముల తో సౌఖ్యం తీసి దెబ్బ తిన్నాడు. తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్న గోపీచంద్ తప్పు మీద తప్పు చేస్తూ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అంటే టాక్ కూడా వినిపిస్తుంది .

ఇందులో దర్శక నిర్మాతల లోపం ఉందా లేక స్వయంకృతాపరాధమా అనేది అర్థం కావటం లేదు ఫాన్స్ కు. నిజానికి గోపీచంద్ ఖాళీగా ఏమి లేడు. మూడు సినిమాలతో బిజీ గా ఉన్నాడు. కాని ఏది రిలీజ్ కాబోతోంది అంటే మాత్రం నో ఆన్సర్. గోపి చంద్ శ్రీకాంత్ మేన కోడలిని పెళ్లి చేసుకున్నారు..

ఆమె తో పెళ్లి కి ముందు .. గోపి చంద్ హైదరాబాద్ కి చెందిన అమ్మాయి తో వివాహం నిశ్చయించారు .. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి నిలిచిపోయింది .. ఆ అతరువాత ఆ అమ్మయి తండ్రి ఆత్మ హత్య చేసుకొని చని పోవడం కూడా జరిగింది .. పెళ్లి అయితే అయిన కలిసి వస్తుందేమో అనుకున్నాడు గోపి చంద్ కానీ ఏమి లేదు .. అలానే ఉంది .. కెరీర్ మాత్రం ..

అప్పుడెప్పుడో బి.గోపాల్ దర్శకత్వంలో నయనతార హీరొయిన్ గా ఓ సినిమా మొదలు పెట్టారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా గోపీచంద్ కనిపించే ఆ సినిమా షూటింగ్ కొంత భాగం జరిగాక తర్వాత ఆపేశారు. ఈ మధ్యే రీ స్టార్ట్ అయింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆరడుగుల బుల్లెటు అనే సినిమా చేసాడు కానీ రిలీజ కు నోచుకోవడం లేదు..మళ్ళి కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వం లో ఓ సినిమా చేస్తున్నాడు ..ఇదైన మంచి హిట్ కొట్టాలని కోరుకుందాం ..

Loading...

please share if you like