ఈ రోజు రాశి ఫలితాలు మీకోసం

please share if you like

మేషం
స్త్రీలు అపరిచిత వ్యక్తులతో మెళకువ వహించండి. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కొన్ని విషయాల్లో మీ ఊహలు, అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.

రాశి లక్షణాలు వృషభం
ప్రత్తి, పొగాకు రైతులకు నెమ్మదిగా మార్పులు సంభవిస్తాయి. మీ ప్రియతములలో మార్పు మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ట్రాన్స్‌పోర్ట్, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. ప్రతి విషయంలో మౌనం వహించడం మంచిదని గమనించండి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

రాశి లక్షణాలు మిథునం
ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరగాయలు, చిరు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండగలదు. మీ కళత్ర ఆరోగ్యం మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.

రాశి లక్షణాలు కర్కాటకం
ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. రుణం ఏ కొంతైనా చెల్లించాలన్న మీ యత్నం ఫలిస్తుంది. మీ సంతానం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.

రాశి లక్షణాలు సింహం
కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు చికాకులను ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు చిన్న సదవకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఖర్చులు ప్రయోజనకరంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఒక స్థిరాస్తి అమ్మాలనే మీ ఆలోచన అధికమవుతాయి.

రాశి లక్షణాలు కన్య
సమావేశాలకు ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నారుల ప్రవర్తన ఆవేదన కలిగిస్తుంది. కళ, సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు కృషి చేయాలి. నూతన పరిచయాలు ఏర్పరుచుకుంటారు. స్త్రీలు షాపింగ్‌లో నాణ్యతను గమనించాలి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి.

రాశి లక్షణాలు తుల
వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు అధికమవుతాయి. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచనలు కొనసాగుతాయి. ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.

రాశి లక్షణాలు వృశ్చికం
బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. సహాయం చేసిన తిరిగిరాజాలదు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. దంపతుల మధ్య దాపరికం మంచిదికాదని గమనించండి. మిమ్ములను పొగిడే వారిని ఓ కంట కనిపెట్టడం ఉత్తమం.

రాశి లక్షణాలు ధనస్సు
కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వృత్తి, ఉద్యోగాలలో ఆశించినంత మార్పు లేకపోవడంతో ఒకింత నిరుత్సాహానికి గురౌతారు. సంకల్ప బలంతో కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ఆపద సమయంలో సన్నిహితులు ఉండగా నిలుస్తారు. మిమ్ములను కొంతమంది ధన సహాయం అర్ధిస్తారు.

రాశి లక్షణాలు మకరం
ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. హోటల్, తినుబండ, క్యాటరింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు వంటివి తలెత్తగలవు. వాహనచోదకులకు చికాకులు అధికమవుతాయి. క్రీడ, కళ, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు.

రాశి లక్షణాలు కుంభం
హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. అనుకున్న పనులు ఒక పట్టాన పూర్తి కావు. బంధువుల నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి.

రాశి లక్షణాలు మీనం
నిర్మాణ పనులు, మరమ్మత్తులతో ఏకాగ్రత వహించండి. రాజీ ధోరణితో వ్యవహరించడం వల్ల ఒక సమస్య పరిష్కారమవుతుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. విద్యార్థులకు కొత్త విషయాల పట్ల అవగాహన, ధ్యేయం పట్ల ఏకాగ్రత ఏర్పడతాయి.

please share if you like