
బీసీసీఐ అధ్యక్షుడుగా ఏకంగా 6 ఏళ్ల పాటు చక్రం తిప్పిన గంగూలీ, మధ్యలో కొన్ని రాజకీయాల కారణంగా bcci పదవికి దూరం అయ్యాడు ఆ తర్వాత icc కి సంభందించిన పదవి కోసం ప్రయత్నించగా అది కూడా ఫలించలేదు అయితే మల్లి ఇప్పుడు ఇంకొక నిర్ణయం తీసుకున్న సౌరవ్ గంగూలి అది ఏమిటంటే మళ్ళి ఐపీఎల్‌లో కి తిరిగి రాబోతున్నాడు . ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కి డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు గంగూలీ. BCCI హెడ్ గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ipl జట్టుకి ప్రధాన కోచ్‌గా, మెంటర్‌గా వ్యవహరించాడు సౌరవ్ గంగూలీ…
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ముందున్న ప్రధాన సమస్య రిషబ్ పంత్ స్థానంలో కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయడం. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కోలుకోవడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని సమాచారం..గత సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్
గంగూలి లాంటి అధ్యక్షుడు దొరకడం ఒకరకంగా భారత క్రికెట్ మండలికి అదృష్టం అనే చెప్పాలి కరోనా లాక్‌డౌన్ టైంలో ఐపీఎల్ 2020 సీజన్‌ని విజయవంతంగా నడిపించి, కోవిడ్ కారణంగా 2021 సీజన్‌కి బ్రేక్ పడినా రెండు ఫేజ్‌లుగా పూర్తి చేశాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. 2022లో కొత్త ఫ్రాంఛైజీలను తీసుకొచ్చి, 2023-27 ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయం ద్వారా వేల కోట్ల ఆదాయాన్ని బీసీసీఐ ఖజానాలో నింపాడు గంగూలీ…