50 ఏళ్ళకు దగ్గర్లో ఉన్నా…హృతిక్ తన 8 ప్యాక్ పొట్టతో అందరి మనసులను గెలుచుకున్నాడు

please share if you like

రోజు రోజుకి ఏజ్ పెరుగుతున్న,కుర్ర హీరోలకి తన ఫిట్నెస్ తో,స్టైల్ తో పిచ్చెకిస్తున్న హృతిక్ రోశన్… హైటు, వెయిట్, గ్లామర్ , ఫిట్ నెస్.. హ్యాండ్సమ్ బాడీ.. ఈ విషయాలలో ఎంత మంద యంగ్ స్టార్స్ పోటీపడుతున్నా.. బాలీవుడ్ సీనియర్ హీరో హృతిక్ రోషన్ ముందు మాత్రం అంతా తేలిపోతున్నారు. 50 ఏళ్ళకు రెండు ఏళ్ల దూరంలో ఉన్న హృతిక్ హాలీవుడ్ హీరోలను మించిన మజిల్స్ తో హంక్ గా చెలమని అవుతున్నాడు. ముందునుంచే కండల హీరోగా హృతిక్ కు బాలీవుడ్ లో ఫాలోయింగ్ చాలా భారీ. అది అలాగే కంటీన్యూ చేస్తున్నాడు స్టార్ హీరో. అమ్మాయిల మనసుల్లో కలల రాకుమారుడిగా తన స్థానం పూర్తిగా నింపుకున్నాడు.

న్యూ ఇయర్ రోజున రోషన్ చేసిన పోస్ట్ ట్రెండింగ్ గా మారింది. వయసుతో సంబంధం లేకుండా ఫిట్ నెస్ కు ప్రాధాన్యత నిస్తూ… ఫిట్ బాడీ కలిగిన హృతికి ఈ వయస్సులో కూడా 8 ప్యాక్ తో సందడి చేస్తున్నాడు. మంచి హైట్,ఫిజిక్ తోఆకట్టుకుంటారాయన. రీసెంట్ గా ఆయన 8 ప్యాక్ బాడీ లేడీ ఫ్యాన్స్ కు మతిపోయేలా చూపించాడు. జిమ్ లో చొక్కా పైకెత్తి తన 8 ప్యాక్ బాడీని చూపిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు.

48 ఏళ్ల వయసులో హృతిక్ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడంటే… అతక్కడ ఆయన పడిన కష్టం 8 ప్యాక్ బాడీ రూపంలో మనం చూడొచ్చు. ఫిట్ గా ఉండటానికి హృతిక్ పడే తపన తలుస్తోంది. ఇక ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో.. అటు ఆడియన్స్.. అభిమానులతో పాటుగా బాలీవుడ్ స్టార్స్ కూడా షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తుషాన్నారు.రకరకాలుగా మంచి కామెంట్లు వస్తున్నాయి.

ఆల్ రైట్.. ముందుకు వెళ్ధాం అంటూ హృతిక్ పెట్టిన పోస్ట్ కు.. ఫోటోలకు కామెంట్స్ పెడుతూ.. సర్.. నాకు రెండు ఆబ్స్ ఇవ్వండి.. అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు కామెంట్ చేస్తూ.. సోమవారం నుంచి నా డైట్ మారుతుంది అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. ‘మళ్లీ పాత హృతిక్ తిరిగి వచ్చాడు.. నా చిన్నప్పడి నుంచీ ఇలానే ఉన్నారు మీరు అంటూ.. మరొకరు పాజిటీవ్ కామెంట్లు చేస్తూ.. హృతిక్ ను పొడగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు ఈ వ్యక్తికి దగ్గర దగ్గరగా 48 సంవత్సరాలు అంటే మీరు నమ్ముతారా అని మరోకరు ప్రశ్నించారు.

ఇక రీసెంట్ గా విక్రమ్ వేద సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు హృతిక్. తమిళ సినిమా రీమేక్ గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది.

please share if you like