స్టార్ హీరో కూతురు ఇప్పుడు ప్రముఖ హీరో తో ప్రేమలో..

please share if you like

బాలీవుడ్ లో ఏ హీరో ఐనా,హీరోయిన్ ఇనా.. ఎవరు కూడా సింగిల్‌గా ఉండరు. తప్పకుండా ఒక డేటింగ్ పార్ట్‌నర్ ఉండే తీరుతారు. దాదాపు కోస్టార్స్ మధ్యనే ఇలాంటి రిలేషన్స్ ఎక్కువగా ఉంటూంతాయి. కొందరు పబ్లిక్‌గా తిరిగేస్తూ తాము ఫ్రెండ్స్ మాత్రమే అని ఓవర్ యాక్షన్ చేస్తారు.. మరికొందరు స్టార్స్ ఓపెన్‌గా తమ రిలేషన్‌షిప్ రివీల్ చేస్తుంటారు. ఇక బీటౌన్ స్టార్ కిడ్స్ విషయానికొస్తే.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ (Sara Ali Khan), యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) జంటకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే గతంలో వీరి ఆఫ్ స్క్రీన్‌ రిలేషన్ నెట్ ఇంట వైరల్ అయ్యింది.


‘లవ్ ఆజ్‌కల్’ సినిమాలో కలిసి నటించిన సారా, కార్తిక్.. నిజజీవితం లో డేటింగ్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే వారి మధ్య ప్రేమ చిగురించగా.. కొంతకాలం క్లోజ్‌గా తిరిగిన ఈ జంట. ఆ తర్వాత విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిక్స్‌ను సారా, కార్తిక్ తమ అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కాగా వీరిద్దరి చిత్రాలకు సంబంధించిన లొకేషన్స్ ఒకటే కావడంతో మళ్లీ కలిసిపోయారా? అని అభిమానులు ఊహాగానాలు మొదలుపెట్టారు. పోస్ట్ చేసిన చిత్రాల ప్రకారం వారు లండన్‌ లో హాలిడే వెకేషన్ లో ఉన్నట్లు తెలిసింది.


నిజానికి ఈ మాజీ లవర్స్ ఎప్పుడూ కూడా తమ రిలేషన్‌ను కన్‌ఫర్మ్ చేయలేదు. కానీ బ్రేకప్‌కు ముందు ఒక నటితో డేటింగ్ చేసినట్లు కార్తీక్ అంగీకరించాడు. అయితే తాను ఏడాదికి పైగా సింగిల్‌గా ఉంటున్నానని చెప్పాడు. ఇక కాఫీ విత్ కరణ్‌ టాక్ షోలో సారా తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావిస్తూ.. ‘అతను అందరికీ మాజీనే’ అని చెప్పింది.


సినిమాల గురించి మాట్లాడితే.. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, కిలాడీ అక్షయ్ కుమార్‌తో కలిసి ‘అత్రంగి రే’ చిత్రంలో ఆఖరిగా కనిపించిన సారా. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఏ వతన్ మేరే వతన్’, విక్రాంత్ మాస్సే, చిత్రాంగద సింగ్‌తో కలిసి ‘గ్యాస్‌లైట్’, అనురాగ్ బసు ‘మెట్రో.. ఇన్ డినో’ చిత్రాలతో పాటు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా ఫిల్మ్ కూడా ఉంది.

ఇక కార్తీక్ ఆర్యన్.. సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఫ్రెడ్డీ’ మూవీలో చివరగా కనిపించాడు. ప్రస్తుతం ‘షెహజాదా’ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ‘హేరా ఫేరి’ ఫ్రాంచైజీలో ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాక్ ఆఫ్ ది హీరోగా కార్తీక్ మారిపోయాడు నా లాగా.

please share if you like