నటి ప్రగతి రెండో వివాహం గురించి సంచలన పోస్ట్ చేశారు. తోడు కావాలని కోరుకున్నట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. వెండితెర మదర్ గా ప్రగతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇరవై ఏళ్లుగా ప్రగతి తల్లి పాత్రలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాక ఆమె పేరు తరచుగా వార్తలకు ఎక్కుతుంది. ప్రగతి వయసుతో సంబంధం లేకుండా బాగా జిమ్ చేసేవారు. డాన్స్ వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఈ వీడియోలను కొందరు ట్రోల్ చేస్తారు కూడా. అయినా అవేమీ ప్రగతి పట్టించుకోరు. ప్రగతి ప్రస్తుతం సింగిల్ మదర్. ఆమె చాలా కాలం క్రితమే భర్తతో విడిపోయారు. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పుడు నిర్ణయంగా ప్రగతి బాధపడుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి… ఆవేశం, ఇగో, నేను ఏదైనా చేయగలను అనే మొండితనం వలన తక్కువ ఏజ్ లో వివాహం చేసుకున్నారు. ఆ నిర్ణయం నా లైఫ్ పై ప్రతికూల ప్రభావం చూపింది.
ఒక తప్పుడు నిర్ణయం వలన ఏర్పడిన పరిస్థితుల నుండి బయటకు రావడం కూడా కష్టమే. హీరోయిన్ గా ఎదిగే రోజుల్లో నేను పెళ్లి చేసుకున్నాను. దాని వలన చాలా నష్టపోయాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పై పెట్టిన ఫోకస్ హీరోయిన్ గా ఉన్నపుడు పెడితే నా లైఫ్ వేరుగా ఉండేదని, ప్రతి బాధపడ్డారు. మరి రెండో పెళ్లి ఆలోచన ఉందా? అని అడగ్గా… పెళ్లి అనడం కంటే తోడు అనుకోవచ్చు. ఒక్కోసారి తోడు కావాలి అనిపిస్తుంది. అయితే నా మెచ్యూరిటీకి మ్యాచ్ అయ్యే వ్యక్తి దొరకాలి. కొన్ని విషయాల్లో నేను చాలా కచ్చితంగా ఉంటాను.
20 ఏళ్ల వయసులో ఉంటే అడ్జస్ట్ అయ్యేదాన్నేమో కానీ… ఇప్పుడు కష్టం, అని ప్రగతి అన్నారు.ఈ వయసులో పెళ్లి చేసుకొని అడ్జస్ట్ అయి బ్రతకడం కష్టం, ఇక పెళ్లి చేసుకోనని పరోక్షంగా ప్రగతి చెప్పారు. ప్రగతి కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్నారు. ఆమె డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. ఆమె కంటూ మంచి సంపాదన ఉంది.