లాక్ డౌన్ తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు మూతపడిన సినిమా హాల్స్, మల్టీప్లెక్సులు ఇప్పుడు ప్రేక్షకులతో సందడి నెలకొంది. జనం కూడా ఇల్లు వదిలి సినిమా చూసేందుకు థియేటర్లకు వచ్చేస్తున్నారు. అయితే సినిమాకు వచ్చే ప్రేక్షకులు ఇంటర్వెల్ సమయంలో పాప్ కార్న్, సమోసా, కూల్ డ్రింకులు అంటూ స్నేక్స్ తీసుకోవడం తినడం ఎప్పటి నుంచే జరుగుతోంది. అయితే
సినిమా హాల్ నిర్వాహకులు వాటి రేట్లను భారీగా పెంచేస్తున్నారు. బయట పది రూపాయులు ఉంటే.. హాల్ లోపల 20 నుంచి 50 రూపాయల వరకు అమ్ముతుంటారు. పోనీ అక్కడ ధరలు ఎక్కువ అని.. మనం ఇంటి నుంచి ఏమైనా స్నేక్స్ తీసుకెళ్తే.. వాటిని మాత్రం లోపలికి అనుమతించారు.
తాజాగా సినిమా హాల్స్ లో ఇలా తినుబండారాల అనుమతిపై… దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం జనవరి 3న సినిమా హాళ్లు యజమానుల ప్రైవేట్ ఆస్తులు, కాబట్టి సినిమా ప్రేక్షకులు ఆహారం , పానీయాలు లోపలకు తీసుకువెళితే వాటిని నియంత్రించే హక్కు వారికి ఉందని పేర్కొంది. “సినిమా హాల్ యజమానికి సంబంధించిన ప్రైవేట్ ఆస్తి.
దీంతో ఆయన పెట్టే షరతులు ప్రజా ప్రయోజనాలకు, భద్రతకు , సంక్షేమానికి విరుద్ధంగా లేనంత వరకు యజమాని నిబంధనలను, షరతులను పెట్టడానికి పూర్తి అర్హత ఉందని పేర్కొంది. నిబంధనలను విధించడానికి యజమాని అర్హడని తెలిపింది. హాల్స్ వద్ద స్నాక్స్, కూల్ డ్రింక్స్ అమ్మకాల కోసం… సినిమా ప్రేక్షకుడు కచ్చితంగా వాటిని కొనుగోలు చేయాలన్న నిబంధన ఏం లేదు కాబట్టి.. ప్రేక్షకుడు అవసరమైతేనే స్నాక్స్ కొనుగోలు చేస్తాడు అది అతని ఛాయిస్ అని కోర్టు తీర్పుని ఇచ్చింది.