మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేర్ వీరయ్య’మరో 9 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. డైరెక్టర్ బాబీ..ఇతను చిరంజీవి వీర అభిమానిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఊర మాస్ లుక్ తో మెగాస్టార్ లుక్ ఇప్పటికే అభిమానుల్లో సినిమాపై విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసింది. ఇక చిరు పక్కన శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరిద్దరి కాంబినేషన్‌లో డిజైన్ చేసిన సాంగ్స్ ఫ్యాన్స్‌ను మతిరేపుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చేసిన సాంగ్స్ దద్దరిల్లిపోతుండగా.. ప్రత్యేకించి ‘శ్రీదేవి’ పాత పిక్చరైజేషన్ చాలా బాగుంది. కానీ షూటింగ్‌లో తనకి నచ్చలేదని..ఇబ్బంది పడినట్లు చెప్పింది శ్రుతి హాసన్.
చిరంజీవి, శ్రుతి హాసన్‌పై డిజైన్ చేసిన ఈ సాంగ్‌ను యూరప్‌లోని అందమైన లోకేషన్లలో చిత్రీకరించాతీశారు. ఇందులో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అందరి దృష్టినీ మళ్లించింది. అయితే మంచు తో కప్పబడిన ఈ లొకేషన్‌లో పాట చిత్రీకరణను శ్రుతి హాసన్ నిజంగా ఆస్వాదించలేదని ఆ టైమ్‌లో తన చేదు అనుభవాన్ని తాజాగా షేర్ చేసింది. ఇంక మరోసారి చీర ధరించి పాట చేయలేమోనని చెప్పింది. ఎందుకంటే ఫిజికల్‌గా చాలా అసౌకర్యాన్ని అనుభవించినట్లు వెల్లడించింది. కానీ అభిమానులు ఇలాంటి సాంగ్స్ కోరుకుంటారనే ఉద్దేశ్యంతోనే చేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఒక మహిళకు ఇది నిజంగానే చాలా ప్రాబ్లం గా ఉంటుందని అభిప్రాయపడింది.
ఇక శ్రుతి హాసన్ ‘వాల్తేర్ వీరయ్య’తో చిరంజీవి తో పాటు సంక్రాంతి బరిలోనే ఉన్న బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ చిత్రంలోనూ ఫిమేల్ లీడ్‌గా నటించింది. అయితే రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం పట్ల స్పందించిన శ్రుతి.. దీని గురించి భయపడలేదని, అందరూ కష్టపడి పనిచేశారని తెలిపింది. ఇక భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్ల చిత్రాల్లో తాను భాగమైనందుకు హ్యాపీగా ఫీల్ అయ్యింది. పైగా రెండు సినిమాలకు ఒకే నిర్మాత కావడం చాలా రేర్ అంటూ చెప్పింది.
ఇక సెన్సార్ ప్రోగ్రాం ని పూర్తిచేసుకున్న ‘వాల్తేర్ వీరయ్య’ మూవీ.. యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. చిరంజీవితో శ్రుతి నటించిన మొదటి చిత్ర ఇదే కాగా.. యాక్షన్, మాస్, రొమాన్స్‌తో పాటు మంచి డ్యాన్స్ నంబర్స్ ప్రేక్షకులను ఆనందిస్తున్నారు. ఇక రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన మెలోడియస్, మాస్ నంబర్స్ ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రానికి ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా.. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఈ సినిమాకి చేసింది