దీనికి నా కష్టం ఎంతో ఉంది..దయచేసి అర్థం చేసుకోండి.. సొహైల్ ఆవేదన

please share if you like

బిగ్ బాస్ సీజన్ 4 లో సోహెల్ డబ్బులు తీసుకుని…సెకండ్ రన్నర్ గా నిలిచాడు. ఫినాలేలో టాప్ 3 కంటెస్టెంట్స్ గా సోహెల్, అఖిల్, అభిజీత్ నిలిచారు. టైటిల్ గెలిచేది ఒకరే కాబట్టి… రూ. 10 లక్షలు తీసుకొని ఒకరు రేసు నుండి తప్పుకోవచ్చని నాగార్జున ఆఫర్ ఇచ్చారు. ఈ ఆఫర్ తీసుకున్న సోహెల్ రూ. 20 లక్షల సూట్ కేసుతో హౌస్ నుండి బయటకు వచ్చాడు. సీజన్ 4 ఫినాలే గెస్ట్ గా వచ్చిన చిరంజీవి సోహెల్ కి మరో రూ. 10 లక్షలు ఆఫర్ చేశాడు. మొత్తంగా రూ. 35 లక్షల వరకూ సోహెల్ అందుకున్నాడు.

అయితే ఫినాలేకి ముందు ఇంట్లోకి వెళ్ళి హౌస్ లో సోహెల్ కి ప్రాణ స్నేహితుడు మెహబూబ్ తన చేతి వేళ్ళతో సొహైల్ కి, నీది 3వ స్థానం అని వేళ్ళతో సైగ చేసి చూపించాడని, అందుకే సోహెల్ తెలివిగా సూట్ కేసు తీసుకొని లాభ పడ్డాడని విమర్శలు వెల్లువెత్తాయి. సోహెల్-మెహబూబ్ కలిసి స్కామ్ చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మెల్లగా సద్దుమణిగిన ఈ ఆరోపణలు లక్కీ లక్ష్మణ్ విడుదల నేపథ్యంలో తెరపైకి వచ్చాయి. లక్కీ లక్ష్మణ్ ప్రీ రిలీజ్ వేడుకలో సోహెల్ ఈ ఆరోపణలపై ఫైర్ అయ్యారు.

నేను దొంగలాగా డబ్బులు తీసుకోలేదు, నాగార్జున గారు ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని బయటకు వచ్చాను. నా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రూ. 25 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఆ డబ్బులతో మా చెల్లి పెళ్లి చేశాను. నా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే వెతికి మరీ తంతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక డిసెంబర్ 30న విడుదలైన లక్కీ లక్ష్మణ్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ చిత్రంపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వాళ్లకు సోహెల్ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు. ”సినిమా చూసేవాడి కి వినోదం మాత్రమే కానీ, చేసేవాడికి జీవితం. దయచేసి తీసిపారేయకండి” అంటూ కామెంట్ పోస్ట్ చేశాడు .

సోహెల్ కామెంట్ వైరల్ అవుతుంది. దర్శకుడు, నిర్మాత, హీరో కలలు, కష్టం, జీవితం ఒక సినిమాపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి సొహైల్ విపరీతంగా ఆవేదన చెందాడు.

please share if you like