బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి భూపాలం పెద్ద చేదు వార్త చెప్పేశారు. ఆమె అనారోగ్యం బారిన పడ్డట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్రకటన చేశారు.వరుసగా తారలు అనారోగ్యం బారిన పడిపోతున్నారు. స్టార్ లేడీ సమంత మయోసైటిస్ తో పోరాడుతున్నారు. గత ఏడాది చివర్లో సమంత ఈ విషయం బయటపెట్టారు. సమంత థర్డ్ స్టేజ్ ఆఫ్ మయోసైటిస్ తో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి కారణంగా సమంత షూటింగ్స్ లో పాల్గొనలేని పరిస్థితి నెలకొంది. ఆమె ఏకంగా హింది, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సైతం క్యాన్సిల్ చేసుకుంటున్నారనిఅని ఓ వర్గ సమాచారం.
తాజాగా యువ నటి పునర్నవి భూపాలం ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇంస్టాగ్రామ్ లో ఆమె ప్రకటించారు. పునర్నవి ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ”నా నూతన సంవత్సరం చెస్ట్ కన్జెషన్ తో మొదలైంది. నేను అనారోగ్యం బారిన పడటం ఇదే చివరిసారి కావాలని కోరుకుంటున్నాను” అని పునర్నవి కామెంట్ పెట్టారు.
ఈ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి బారిన పడినవారు దగ్గు, ఊపిరి సరిగా తీసుకోకపోవడంతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటారు. పునర్నవి అనారోగ్యం బారినపడ్డారని తెలిసిన అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పునర్నవి త్వరగా కోలుకోవాలని బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.
పునర్నవి బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్నారు. ఆ సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో పునర్నవి ప్రేమ వ్యవహారం విపరీతంగా ఫేమస్ అయ్యి రాహుల్ ని ఐతే విన్నర్ కూడా చేసింది . అప్పట్లో ఈ జంట గురించి జనాలు ప్రముఖంగా చెప్పుకున్నారు. హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరు సన్నిహితంగా ఉన్నారు. ఒక దశలో వివాహం చేసుకుంటారంటూ ప్రచారం కూడా జరిగింది. మెల్లగా ఎవరి దారి వారు చూసుకున్నారు.
చాలా చిన్న వయసులో పునర్నవి పరిశ్రమకు వచ్చారు. 2013లో విడుదలైన ఉయ్యాలా జంపాలా చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ చేశారు. బిగ్ బాస్ షో అనంతరం ఆమెకు హీరోయిన్ గా ఆఫర్స్ వచ్చాయి. ఎందుకో ఏమో, ఒక చిన్న విరామం, సైకిల్ చిత్రాల్లో ఆమె నటించారు.
ఈ మధ్య ఆమె అసలు కనిపించడం లేదు . ముక్కుసూటిగా మాట్లాడే పునర్నవికి సినిమాల్లో అస్సలు ఆఫర్స్ రావడం లేదు. దాదాపు 9 ఏళ్లుగా పరిశ్రమలో ఉన్న పునర్నవి వయసు కేవలం 26 ఏళ్ళు మాత్రమే. బిగ్ బాస్ హౌస్లో పునర్నవి 11 వారాలు ఉన్నారు.