ప్రముఖ నిర్మాత సురేష్ బాబు..నడిరోడ్డుపై కారు దిగి..స్వయంగా ట్రాఫిక్ ని కంట్రోలు చేసిన సంఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన చేసిన పనిని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఓ భాధ్యతగల పౌరడుగా ఆయన వ్యవహరించారని అందరూ ప్రశంసిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…
హైదరాబాద్ లో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. ప్రతి రోజు వందలాది కొత్త వాహనాలు రోడ్డు మీదకు రావటమే అందుకు కారణం.ఈ క్రమంలో తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో, అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు తన కారు నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రణలోకి తీసుకొచ్చారు.
సాక్షాత్తు ఒక సినీ ప్రముఖుడు ట్రాఫిక్ ను క్లియర్ చేస్తుండటం వాహనదారులను ఆకట్టుకుంది. ఈ సంఘటనను వారు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు సురేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక సినిమాలు విషయానికి వస్తే..సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గత కొంతకాలంగా సినిమాలు తీయటం తగ్గించారు. సురేష్ బాబు మాత్రం సంక్రాంతి సినిమాల పోటీపై మాట్లాడి వివాదాస్పదమయ్యారు. సీనియర్ నిర్మాత సురేష్ బాబు కూడా ఈ విషయంపై స్పందిస్తూ తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం సరైనది కాదన్నట్టు ఈయన మాట్లాడారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ ఇతర భాష చిత్రాలను ఎవరు ఆపలేరని సంక్రాంతికి అన్ని సినిమాలు ఆడుతాయని ఈయన వెల్లడించారు. తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి మన సినిమాలను ఏ భాషలో కూడా చులకనగా చూడలేదు.
ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సమయంలో చెన్నైలో కూడా చిన్న సినిమాలకు కాస్త ఇబ్బంది ఏర్పడి ఉంది.ఆయనప్పటికీ ఈ సినిమా విడుదలకు థియేటర్స్ ఇచ్చారు ఒకవేళ సినిమా బాగుంటే మరికొన్ని థియేటర్స్ లో రన్ అవుతుంది లేదంటే మరుసటి రోజు సినిమాని తొలగిస్తారు. సినిమా అనేది ఒక బిజినెస్ అంతే ఇక్కడ ఎవరి ఇష్టం వారిది. ఒకవేళ సినిమా ఆడుతుంది అనే నమ్మకం ఉంటే ఎక్కువ థియేటర్స్ ఇస్తారు.అంతేకానీ అది ఏ భాష చిత్రమని ఎవరు చూడరని మన తెలుగు సినిమాలు కూడా ఇతర భాషలలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాలను అందుకున్నాయని ఈ సందర్భంగా సురేష్ బాబు చేసారు