కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ తో ప్రేమ లో పడ్డా శ్రీముఖి..త్వరలోనే పెళ్లి ఏర్పాట్లకు కుటుంబం సిద్దం..?

please share if you like

శ్రీముఖి కెరీర్ ఇప్పుడు ఓ వేరే రేంజ్ లో ఉంది..చెరీ నిండా భారీ ఆఫర్లతో ఒకపక్క యాంకర్ గా ఒకపక్కా వీడియొ లతో దుమ్మురేపుతున్న శ్రీముఖి…కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుందా..?అనే వార్త మణికొండలో చెక్కేర్లు కొడుతుంది.అయితే

స్టార్ యాంకర్ గా శ్రీముఖి కుమ్మెస్తుంది. అనసూయ, సుమలను కూడా వెనక్కి నెట్టి వరుస ఆఫర్స్ పట్టేస్తుంది. టెలివిజన్, ఓటీటీ అనే తేడా లేకుండా ఈవెంట్స్ తో కుమ్మేస్తుంది. ప్రస్తుతం తెలుగు యాంకర్స్ లో ఆమెదే నంబర్ వన్ పొజిషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని షోలు ఆమె చేతిలో ఉన్నాయి.ప్రస్తుతం ఊపిరి సలపని బిజీ షెడ్యూల్స్, చేతి నిండా సంపాదన శ్రీముఖి సొంతం. అలాంటి శ్రీముఖి మరోవైపు ప్రేమాయణం కూడా నడిపిస్తున్నారన్నది తాజా వార్త. ఆమె ఏకంగా పెళ్ళికి సిద్ధమయ్యారు అంటున్నారు. గతంలో పెళ్లి థర్టీ ప్లస్ లోనే చేసుకున్నానని శ్రీముఖి అన్నారు. ప్రస్తుతం ఆమె వయసు 29 కాగా ఈ ఏడాది మే 10కి 30 ఏళ్ళు రానున్నాయి. కాబట్టి ఆమె చెప్పిన టార్గెట్ కి కూడా ఈ ఏడాది ఆమె రీచ్ అవుతుంది.

అసలు 2023లో శ్రీముఖికి పెళ్లి ఖాయం అంటున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లని పూర్తయ్యాయట. కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మాన్ తో చాలా కాలంగా శ్రీముఖి రిలేషన్ లో ఉన్నారు. ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు కలిసి మాట్లాడుకున్నారట.త్వరలో అధికారికంగా పెళ్లి ప్రకటన రానుంది, అంటున్నారు.

అయితే శ్రీముఖి పెళ్లిపై ఎలాంటి క్లారీటి అస్సలు ఇవ్వలేదు. పెద్ద ఎత్తున ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల శ్రీముఖి నూతన గృహప్రవేశం చేశారు. శ్రీముఖి నెల సంపాదన కోట్లకు చేరిన తరుణంలో ఆమె నూతన సొంతింటి కల నెరవేర్చుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు.

జాతిరత్నాలు, స్టార్ మా పరివార్, డాన్స్ ఐకాన్, మిస్టర్ అండ్ మిసెస్,బీబీ జోడి, అంటూ పలు షోలకు శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. కొత్తగా బీబీ జోడి అనే ఎంటర్టైన్మెంట్ షో స్టార్ట్ కానుంది. దీనికి కూడా శ్రీముఖినే యాంకర్. శ్రీముఖి యాంకరింగ్ లో తనదైన శైలికి కలిగి ఉండటం ఆమెకు కలిసొస్తుంది. పటాస్ షోతో బుల్లితెర యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీముఖి అనతి కాలంలో గుర్తింపు తెచ్చుకున్నారు. పటాస్ చెప్పుకోదగ్గ సక్సెస్ అయిన నేపథ్యంలో శ్రీముఖికి మెల్లగా ఆఫర్స్ క్యూ కట్టాయి.

బిగ్ బాస్(Bigg Boss) షోకి వెళ్లడం కూడా శ్రీముఖికి కలిసొచ్చింది. సీజన్ 3లో శ్రీముఖి పాల్గొన్నారు. తన ఆటతీరుతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరింది. బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. రాహుల్ సిప్లిగంజ్గెలిచాడు.

అప్పటికే ఫార్మ్ లో ఉన్న యాంకర్ కావడంతో శ్రీముఖికి భారీగా పారితోషికం వస్తున్నట్లు సమాచారం.బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా శ్రీముఖినే ఎక్కువగా లబ్ది పొందారన్న మాట వచ్చింది. అప్పటి నుండి శ్రీముఖికి అవకాశాలు పెరుగుతూ..వస్తున్నాయి

please share if you like